Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ - ములుగు
గోదావరి ముంపు నిర్వాసితులకు కోడిపుంజుల అంగడి భూమి కేటాయించాలని ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కలిసి పలు సమస్యలు వివరించి లేఖ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటూరునాగారం గోదావరినది తీర సమీప ప్రాం తంలో ఉన్న అణగారిన కులాలకు చెందిన నిరుపే దలు జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తూ కొనసా గించుకుంటున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్పుడల్లా ముంపు ప్రాంతంలో ఉండే ప్రజలు ప్రాణా లను అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారని అన్నా రు. ముంపు ప్రాంత ప్రజల స్థిర నివాసం కొరకు ఏటూరునాగారం మానసపల్లి శివారులో ఉన్న కోడిపుంజుల అంగడి ప్రభుత్వ భూమిని ముంపు బాదితులకు ఇళ్ళ స్థలాలను కేటాయించాల న్నారు. కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాలలో వరదలకు నీట మునిగిన గుర్తించి ప్రభుత్వానికి చెందిన సురక్షితమైన స్థానంలో ఇళ్ళ స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు, అంగన్వాడీ భవనం ప్రారంభం
మండలంలోని అబ్బాపూర్ గ్రామంలోని శ్రీరా ముల పల్లి సీతక్క కాలనీ లో రూ.4.99 లక్షలతో సీసీ రోడ్డు, అంగన్ వాడీ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క సోమవారం సర్పంచ్ గండి కల్పనా కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం అబ్బాపూర్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యా ర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు చదువుకోవాలనీ, పాఠశా ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి పరిష్కరిస్తానని అన్నారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, సర్పంచ్ గండి కల్పనకుమార్, మాజీ సర్పంచ్ ఆనందం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్, గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి, మొడెం మొగిలి, తదితరులు పాల్గొన్నారు.