Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇండ్లు..
- భూపాలపల్లిలో ఒక్కరోజు నిరసన దీక్షలో గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంతోపాటు పంపిణీ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హామీల అమలులో విఫలమైంద ని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి కాంగ్రెస్ నియో జకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కొత్తగా ఇండ్లు నిర్మిం చుకోవాలంటే రూ.3 లక్షలు సరిపోతాయా? ఆ డబ్బులు మేస్త్రీ కూళ్లకు కూడా చాలవని అన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఇండ్లు లేని పేద, నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణ, గ్రామీణ మండలాల అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, సుంకరి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పేదోడికి సొంతిళ్లు కూడా కట్టుకునే అదృష్టం లేకుం డా పోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇళ్లు నిర్మాణం కొరకు రూ.5లక్షలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు రూ.3లక్షలు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో కేవలం మూడు వేల మందే అర్హులు ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు అందరికి రూ.5లక్షలు వ్వాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ళ పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, నిరుపేద ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాయని మండిపడ్డారు. పేద ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతామని హెచ్చరించారు. దేశానికి దశాదిశ నిర్దేశించగల బలమైన నాయకుడు రాహుల్ గాంధీయేనని అన్నారు. కాంగ్రెస్ హయాం లో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి పేదలకు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళ పేరిట నిర్మాణాలు చేపట్టినా నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదని అన్నారు.
ఆకట్టుకున్న బహుజన కళా మండలి పాటలు..
ఈ నిరసన దీక్షలో సురేష్ కు చెందిన బహుజన కళా మండలి బృందం పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వాల అన్యాయాలు, అక్రమా లను పాటల ద్వారా అవగాహన కల్పించారు. టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, పట్టణ 16వ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, భూపాలపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువనసుందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పోరిక సమ్మయ్య నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, ఐఎన్టీయూసీ నాయకులు జోగు బుచ్చయ్య, బుర్ర కొమురయ్య, జిల్లా నాయకులు దూడపాక శంకర్, పిప్పాల రాజేం దర్, తోట సంతోష్, అంబాల శ్రీనివాస్, రామినేని రవీందర్, గణపురం మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, నగునూరి రజినీకాంత్, తోట రంజిత్, ఎస్పికె సాగర్, పొనగంటి శ్రీనివాస్, బౌతు రాజేశ్, కంచర్ల సదానందం, సీనియర్ నాయకులు, గ్రామ కమిటీల అధ్యక్షులు, నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.