Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశం
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజావాణిలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను వెంట నే పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆదేశిం చారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారుతో కలిసి ఆయన ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తు లను వీలైనంత త్వరగా పరిశీలించాలని ఆదేశించారు. వివిధ శాఖల వారీగా పెం డింగ్‌లో ఉన్న దరఖాస్తులు వివరాలను అడిగి తెలుసుకుని వాటికి సమాధానాలు పంపాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రతీ జిల్లా అధికారి తప్పనిసరిగా హాజ రుకావాలని సూచించారు. కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 42, డిఆర్డిఓకు 4, ఇరిగేషన్ 2, డిపిఓ 4, మొత్తం 66 దరఖాస్తులు వచ్చా యి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, కృష్ణవేణి, డిఆర్డిఓ రామిరెడ్డి, రాధిక, సిపిఓ ఇస్మాయిల్, డీఎస్ఓ రోజారాణి, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ సంధ్యారాణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.