Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనఊరు -మనబడి పనులను వేగవంతం చేయాలి
- జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి
నవతెలంగాణ-పెద్దవంగర
కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మండలంలోని అవుతాపురం, గంట్లకుంట, చిట్యాల పాఠశాలలను ఆమె సందర్శించారు. ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు-మనబడి పనులను ఆరాతీశారు.డైనింగ్ హాల్ నిర్మాణం, విద్యుత్, ఈజీఎస్ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. మండల వ్యాప్తంగా 12 పాఠశాలలను ఎంపిక చేయగా, మొదటి దశలో నాలుగు పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాఠశాలలో అబివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల తో ముచ్చటించి, ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రేరణ కల్పించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యసాధనకు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, పదిలో 10 జీపీఏ లక్ష్యంగా చదవాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ఆలందాస్ బిక్షపతి, శ్రీని వాస్, వెంకన్న, ఎస్ఎంసీ చైర్మన్ సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు క్షీర సాగర్ రవికుమార్, రమేష్, రామ్మోహన్, రవి, శ్రీను, నరసింహ, రత్నం, సంతోష్ కుమా ర్, సునీత, గోవర్ధన్, సురేష్, రామతార, తదితరులు పాల్గొన్నారు.