Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా అదన పు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు.సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టరు కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కురవి మండలం సుదాన్పల్లి గ్రామానికి చెందిన ఫర్జానా బేగం వితంతు ఫించను కోసం దరఖాస్తు చేసుకోగా రేషన్ కార్డు అడుగుతున్నారని, రేషన్ కార్డు ఇప్పించి వితంతు ఫించను మంజూరు చేయాలని కోరారు. కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామాని కి చెందిన రైతు తోకల వెంకటయ్య సర్వే నెం.485/5 లో గల 5 ఎకరాల మెట్ట భూమిని కొప్పుల లచ్చమ్మ వారి వద్ద 1967లో ఖరీదు చేసినానని ఇట్టి భూమి పట్టాకొరకు 2018లో సాదాబైనామాకు, 2020లో మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నానని, ఇట్టి భూమిని నా పేరు పైన రికార్డు చేసి పట్టా ఇప్పించగ లరని విజ్ఞప్తి చేశారు. గార్ల మండలానికి చెందిన మంగలి శంకరమ్మ తన భర్త 2020లో కోవిడ్ వలన మరణించాడని, జీవనోపాధి ఇబ్బందిగా ఉందని బ్రతుకు దెరువు కొరకు ఎటువంటి ప్రత్యమ్నాయాలు లేవని, 10వ తరగతి దాకా చదివి ఉన్నానని, గార్ల ప్రభుత్వ పాటశాల యందు ఖాళీగా గల కుక్, అసి స్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నా నని ఏదైనా ఒక పోస్టు ఇప్పించి జీవనోపాధి కల్పిం చాలని కోరారు. మహాబూబాబాద్ పట్టణానికి చెంది న ఎస్.డి ఇమామ్ గత కొన్ని సంవత్సరాలుగా కిరా యి ఇంట్లో ఉంటూ జీవనోపాధికై పాములు పట్టు కుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేస్తున్నటు వంటి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయగ లరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 70 ధరఖాస్తులు వచ్చా యి. ఈ ప్రజావాణిలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.