Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 2.80కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన - మహిళా గ్రామ సంఘానికి రూ.20 లక్షలు
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పాబ్బం గడుపుతోన్న మతతత్వ బీజీపీ ప్రజా కంటక పాలన సాగిస్తున్నదని రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అమర వీరుల స్థూపం నిర్మాణానికి భూమి పూజ చేసి, జీపి కాంప్లెక్స్ భవనం రూ.60లక్షలు, క్రీడా ప్రాంగణం రూ. 8.29లక్షలు, సీసీ రోడ్లు రూ.8లక్షలు, రూ. 94 లక్షలు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పైపు లైన్ నిర్మాణం పనులు, సెంట్రల్ లైటింగ్ రూ. 19లక్షలు, దళిత బంధు సహకారంతో 70లక్షల యూనిట్లను ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు ప్రజాప్రతి నిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కళా కారులు, డబ్బు చప్పుళ్లతో, కోలాటాలతో ఘన స్వాగ తం పలికారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యా లయ ప్రాంగణంలో సర్పంచ్ తాటికొండ సురేష్ కు మార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోరాష్ట్రంలోని 12769 పంచాయితీల్లో ఏకకాలంలోసర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, దేశంలోని 28రాష్ట్రాల్లోకెల్లా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణా రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. మోడీ మొండిగా వ్యవహరిస్తూ, దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనివిమర్శించారు. రైతు వ్యతిరేక చట్టా ల్ని తెచ్చి, 750 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకు న్న దౌర్భాగ్య ప్రభుత్వమని, మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అన్నింటా జీఎస్టీ పేరిట పెంచి, పేదప్రజల నడ్డివిరిచే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దయతో అడిగిన వెంటనే అనేక సంక్షేమ అభివృద్ధి పనులు ఇక్కడ మంజూరీ చేశారని అదనంగా ఇటీవల మంజూరైన మVి ళా డి గ్రీ కళాశాల నిదర్శనమన్నారు.తాను బ్రతికున్న కాలం నియోజక వర్గ ప్రజలే దేవుళ్ళుగా, నియో జక వర్గమే దేవాలయంగా భావించి ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన స్థానికుడిగా ప్రజందరికీ తనవంతు బాధ్యతగా సా యంగా ఉంటానని, ప్రభుత్వ పథకాలైన దళిత బం ధు ద్వారా ప్రతీ దళిత కుటుంబాలకు అందించి తీరు తానని తెలిపారు. మండలకేంద్రంలో గ్రామైఖ్య మహి ళా సంఘం నూతన భవనం నిర్మా ణానికి 20 లక్షలు మంజూరు చేశారు. నిరుపేదలకు డబల్ బెడ్రూం ఇండ్లు 210 కేటాయించి, సంక్రాంతి లోపు కేటా యించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోజెడ్పీస్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, డీఆర్డీఓ రాంరెడ్డి, ఎంపిపి కందుల రేఖ, ఆఫీస్ ఇంచార్జీ ఆకుల కుమార్, ఈడి వెంకన్న, ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చల్లా చం దర్ రెడ్డి, ఎంపిటిసిలు గన్ను నర్సింహులు, దయా కర్, రాజు, ఉప సర్పంచ్ ఐలయ్య, ఏఎంసీ డైరెక్టర్లు పెంతల రాజ్ కుమార్, సరితాంజనేయులు, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, డీఎల్పీఓ వెంకటప్రసాద్, ఎంపీడీఓ క్రిష్ణ, ఎంపీఓ సుధీర్ కుమార్, ఈఓ సత్య నారాయణ, మారేపల్లి ప్రసాద్, తాటికొండ రమేష్, బొంకూరి మహేష్, గాదె రాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.