Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ చేస్తున్న సీఐ, ఎస్ఐలు
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని పెద్ద చెరువు సమీపంలో బాంబు పేలుడు మండ లంలో కలకలంగా మారింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కోటగడ్డ సమీపంలో ని పెద్ద చెరువు కట్టపై ఆదివారం సాయంత్రం బాంబు పేలుడు కలకలం సృష్టించిందని, జిల్లాలోని కురవి మండ లం ఊరు గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన నలుగురు రైల్వే ఉద్యోగులు బోదంగండ్ల రవి కుమార్, కూస రాజు, పుష్పల మహేష్, కోమరెల్లి వ్యక్తులు ఆది వారం సాయంత్రం పెద్ద చెరువు కట్టపై భోజనాలు ఏర్పాటు చేసుకొని, మద్యం సేవించి ఆహ్లాదకరంగా గడిపినారని తెలిపారు. ఈ క్రమంలో అందులో నుంచి రవి అనే వ్యక్తి బహిర్భూమికి బయటకు వెళ్లి, కొంత సమయం అయిన తర్వాత ఒక్కసారిగా బాంబు పేలుడు శబ్దం వినిపించడంతో మిగిలిన స్నేహితులు అక్క డికి చేరుకొని గాయలపాలైన రవిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. రవి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, గాయాలపాలైన రవికి హైదరాబాదులో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఈ సంఘటన పై సోమవారం సిఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాంబు పేలుడు ఎలా సంభవించింది..? ఆ స్థలానికి బాంబు ఎలా వచ్చింది..? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.