Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్ధు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈనెల 13న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణిసిద్ధు, ఎంపీపీ మందల లావణ్య కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారికంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇదే క్రమంలో అతని తండ్రి గండ్ర మోహన్‌రెడ్డి స్మారకర్థం ఏర్పాటు చేసిన జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఎన్నో సామా జిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నియోజకవర్గస్థాయి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోటీల్లో 5రకాల ముగ్గులు వేయాలన్నారు. ఒక్కో విభాగానికి సంబంధించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి రూ.5000 ,ద్వితీయ బహుమతి రూ.3000, తృతీయ బహుమతి రూ.2000 అందజేస్తా మని తెలిపారు. ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో మొత్తం 15మంది విజేత లకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉత్సాహవంతులైన మహిళలు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మ, కౌన్సిలర్లు ,దార పులమ్మ ,పానుగంటి హారిక ,మేకల రజిత చల్లా రేణుక ,పిల్లలమర్రి శారద, కుర్మిళ్ల రజిత ,కో ఆప్షన్ మెంబెర్ కమల మరియు మహిళా నాయకురాళ్లు స్వాతి ,భాగ్య లక్ష్మి ,స్వప్న మరియు గ్రంధాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్ గౌడ్ ,అర్బన్ పార్టీ అధ్యక్షులు కటకం జనార్దన్ మునిసిపల్ వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు , పి ఎస్ సి ఎస్ చైర్మెన్ మేకల సంపత్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు కరీమ్ , కౌన్సిలర్లు సజనాపు స్వామి, ముంజల రవీందర్,కో ఆప్షన్ ఇర్ఫాని, అర్బన్ నాయకులు సిద్దు , రమేష్, కుమారస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు.