Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోడెల నరేష్ (పూల నరేష్)ను నియ మిస్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క సోమవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, ములుగు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డిల సమక్షంలో నరేష్‌కు నియామక పత్రాన్ని సీతక్క అందజేశారు. మండలంలోని నర్సాపురం బోర్ గ్రామానికి చెందిన నరేష్ స్థానికంగా జ్వాలా యూత్ అసోసియేషన్, జ్వాలా ట్రస్టులకు వ్యవస్థాపక అద్యక్షుడుగా పని చేస్తున్నాడు. మండల వ్యాప్తంగా సేవలందించడమే కాకుండా ఎమ్మెల్యే సీతక్క సామా జిక సేవా కార్యక్రమాలకు ముగ్దుడై రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుండి మండలంలో యూత్ కాంగ్రెస్, పార్టీ బలోపేతానికి కషి చేస్తూ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయనకు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, గుమ్మడి సోమయ్య, మైల జయరాం రెడ్డి ఇతర మండల, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో యూత్ కాంగ్రెస్ కార్య క్రమాలు జిల్లాలో చేపడతానన్నారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లెపల్లి శివప్రసాద్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహారావు, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకష్ణ, తూడి భగవాన్ రెడ్డి, అయ్యోరి యానయ్య, ఉజ్వల్, కురుసం రమేష్ చెట్టుపల్లి ముకుందంలు పాల్గొన్నారు.