Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగును విజయవంతం చేయాలి
- వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి చూపు సరిగా ఉండాలని సీఎం కేసీ ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అందత్వ రహిత తెలంగాణ స్థాపన సీఎం కేసీఆర్ లక్ష్యమని వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కంటి వెలు గు సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ పర్సన్ జ్యోతి పాల్గొని మాట్లా డారు. ఈనెల 18 నుండి 100 రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్ర మాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరుఅర్హులని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల భాగ స్వామ్యంతో అందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏఎన్ ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో రెండు టీములుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించ డంతోపాటు వారి లోపాన్ని గుర్తించి అద్దాలను పంపిణీ చేస్తారని తెలిపారు. కం టి శస్త్ర చికిత్సలకు కూడా ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్ర మంలో 10 టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్ ఆఫీసర్, సూపర్వై జర్, ఆప్తాలమజిస్ట్, డిఈఓ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఉంటారని, గ్రామీణ ప్రాంతంలో రోజు 300 మందికి, మునిసిపాలిటీలలో 400 మంది పైగా కంటి ప రీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసి కంటి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ నందకిషోర్, వైస్ ఎంపీపీ రాంశెట్టి లతా లక్ష్మారెడ్డి, తహసిల్దార్ చలమల్ల రాజు, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, ఎం పీఓ రంజిత్‌కుమార్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, పర కాల ఏఎంసీ మాజీ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రవి, పిహె చ్‌సీ వైద్యాధికారి సాయికృష్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యద ర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.