Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరూరి కుమార్
నవతెలంగాణ-పర్వతగిరి
జిల్లాలో దళితుల భూములకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా వి ఫలం అవుతున్నాయని కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరూరికుమార్ అ న్నా రు. మండలంలోని అన్నారం షరీఫ్‌లో దళితుభూములను ఆక్రమించుకున్న వారి పైచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో దళిత, కులసంఘాల ఆధ్వ ర్యంలో చేపట్టిన దీక్ష,నిరసన మంగళవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆరూరి కుమార్ ఆయన మాట్లాడుతూ అన్నారం షరీఫ్ లో 19 72 కాలంలో ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూమిని కొంతమంది ప్రవేట్ బడాబాబులు కబ్జాకు పాల్పడడాన్ని దళితుల భూమిని రక్షించాల్సిన ప్రభుత్వం చో ద్యంచూస్తు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల కు అసైన్డ్‌భూములకు దళితులకు ప్రభుత్వాలు కేటాయించిన భూములకు పూర్తిగా రక్షణ లేకుండా పోతున్నదని దళితులను మార్చి మీదేగా కబ్జాలు చేసుకోవడం పరి పాటైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దళితుల భూము లపై ప్రత్యేక చర్యలు చేపట్టి జిల్లాలో ఉన్న అనేక ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూసే విధంగా చర్యలు చేపట్టాలని దానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అన్నవరం చెరువులో దళితుల భూమిని ఆక్రమించుకున్న కూరపాటి సోమయ్యపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దళితులకు భూమిని తిరిగిచ్చేవరకు ఉద్యమా న్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి దయాకర్, భూ సం రక్షణ కమిటీ సభ్యులు నకరికంటి రామచంద్రు,గడ్డం యాకాంబరం ,ఆబర్ల రాజు, పసునూరి మహేందర్, ఆబర్ల యాకరాజు, కొండేటిమహేందర్, పసునూరి వినో ద్, యనమల రాజు, తదితరులు పాల్గొన్నారు.