Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ- ములుగు
మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ రాజకీయం చేస్తున్నదని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆరో పించారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో మం డల అధ్యక్షులు చెన్నొజు సూర్యనారాయణ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమాy శంలో సీతక్క మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటే నరేంద్ర మోడీ ఓర్వలేక పోతున్నాడన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ హామీలివ్వడం తప్ప అమలులో విఫలమవు తున్నాడన్నారు. దళితులకు మూడెకరాల భూమి పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫి తదితర హామీలు బుట్టదాఖలయ్యా యన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. టీపీసీసీ సభ్యులు మాల్లాడి రాం రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ,ఎండీ చాంద్ పాషా,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఆకు తోట చంద్ర మౌళి,ఎన్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, సర్పంచులు మాడ ప్రకాష్, చేద సరాంగం, సుమన్, ఎండీ అహ్మద్ పాషా, రాంబాబు, ఎంపీటీసీ జంగిలి శ్రీలత, భాస్కర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జటోత్ గణేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దం రాఘవేందర్, అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జంగిలి రవి, తదితరులు పాల్గొన్నారు.