Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
సంపూర్ణ రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్బాబు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రమెన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం చేసిన 25 శాతం మాఫి బ్యాంక్ వడ్డీలకే సరిపోయిందన్నారు. వ్యవసా యానికి 24 గంటలు కరెంట్ ఇస్తామని కేవలం 8 గంటలు మాత్రమే ఇస్తోందని, నిత్యావసర ధరలను అదుపులో ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందన్నారు. రైతులకు రైతుబందు ఇస్తున్నా మంటూ ఎరువుల ధరలు పెంచడం సరికాదన్నారు. మద్దతు ధరకు వరి ధాన్యం కొనుగోలు చేయకపోగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మకై క్వింటాలు ధాన్యానికి 10 కిలోల వరకు కోత విధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాడి చెర్ల ఓసీపీలో ప్రతి నిర్వాసితునికి ఉద్యోగ,ఉపాధి కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మానేరు నుంచి మట్టి రోడ్డును వెంటనే తొలగించి తారు రోడ్డు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి,ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, సర్పంచ్లు శనిగరం రమేష్, జనగామ స్వరూప బాపు, ప్రదాకార్యదర్శి రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతిరావు, మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు మంత్రి రాజా సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, బొబ్బిలి రాజు గౌడ్, లింగన్నపేట శ్రీదర్,పుప్పాల రాజు, చెంద్రయ్య, సురేష్ రావు, ప్రభాకర్ పాల్గొన్నారు.