Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే టీఎస్ యూటీఎఫ్ మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు రమేష్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యా లయ ఆవరణలో గోడ పత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో ని బీఎన్ఆర్ సార్ధ కన్వెన్షన్ సెంటర్లో మహా సభలు జరగనున్నాయని తెలిపా రు. మహాసభలలో విద్యారంగ, ఉపాధ్యాయ సమ స్యలపై చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిం చనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజ, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు, ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవ, సెక్టోరియల్ అధికారులు కిషన్‌రావు, లక్ష్మణ్, ఎంఎస్ఓ కరుణాకర్, తిరుపతయ్య ఈశ్వర్, రాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు
మంగపేట : యూటీఎఫ్ రాష్ట్ర 5వ, మహాసభల వాల్ పోస్టర్‌ను ములుగు జిల్లా కార్యదర్శి ములుకాల వెంకటస్వామి మంగళవారం మండలం లో ఆవిష్కరిం చారు. ఈ నెల 13,14న రంగారెడ్డి జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని సంఘం భాద్యులకు పిలుపునిచ్చారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు గుండం పురుషోత్తం, శ్రీరాముల సతీష్ కుమార్, కార్యదర్శులు ఆగబోయిన వెంకటేశ్వర్లు, పి.సారంగపాణి, టి.నాగేశ్వర్ రావు, టి.ఆదిలక్ష్మి, నయీమున్నిసాబేగం, పూర్ణ పాల్గన్నారు.