Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
నవతెలంగాణ-భూపాలపల్లి
రేషన్ బియ్యం సరఫరాలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షు డు అప్పం కిషన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో సుమారు 277 రేషన్ షాపులలో లక్షమందికి పైగా ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం ఇప్పటివరకి అందలేదని ఆరోపిం చారు. మరో రెండు రోజులలో సంక్రాంతి పండుగ ఉండడంతో పేద ప్రజలు అయోమయానికి గురై అక్రమదారుల వద్ద ఎక్కువ రేటు పెట్టి బియ్యం కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని సకాలంలో ఇవ్వకుండా వారి స్వార్ధ రాజ కీయాల కోసం పేదల కడుపు కొడుతున్నాయని ఆరో పించారు. పండుగ వేళలో ఆడబిడ్డలు ఇంటికి వస్తే దిక్కు తోచని పరిస్థితులల్లో తల్లిదండ్రులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు స్కూల్లు, కాలేజీలు సెలవులు ప్రకటించినా పిల్లలు సంబరంతో ఇంటికి వస్తే పస్తులే ఉండాలని వాపోయారు. ప్రభుత్వాలు పేదలకు బియ్యం పంపి ణీ చేయాలని అన్నారు. రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో ఇప్పటి వరకు బయోమెట్రిక్ కూడా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. గురుకులం హాస్టల్స్‌లో అందాల్సిన బియ్యం పై కలెక్టర్ దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయ కులు అర్జున్, తిరుపతి, సుధాకర్ ,రాజు రెడ్డి, రమేష్, శ్రీనివాస్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.