Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-హన్మకొండ
ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారు లపైమోపిన ఏసిడి చార్జీలను తక్షణమే రద్దు చేయా లని ఏసీడీ చార్జీలు చెల్లిస్తేనే విద్యుత్ బిల్లులు తీసు కుంటామని నిబంధనను తక్షణమే ఉపసంహ రించు కోవాలని సీపీఎం హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. గురువారం ఎన్పీడీసీ ఎల్ ఎస్సీ కార్యాలయం ముందు జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం వినతి ప త్రం అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లా డుతూ విధ్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ఎన్డిసిఎల్ షాక్ ఇచ్చింది. జనవరి 2023 నెలలో వినియోగదా రులకు జారీ చేసిన కరం టు బిల్లులో వాడుకుంటు న్న విద్యుత్ధర కంటే ఎసి డి ఛార్జీలపేరుతో అదనం గా మోపారు. ఇది ఎందు కు వేసారో తెలువక ప్రజ లు ఇబ్బందులు పడుతు న్నారు. గతఏడాది అదన పులోడు వాడుతున్నారని డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేసారు. తక్కువ లో డుతో మీటర్ల అనుమతి పొంది అధికంగా-కరంటు వాడు తున్నందున వసూలుచేస్తున్నామని అధికారు లు తెలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఇల్లుఅ ద్దెకు ఇస్తేకిరాయి ఏసిడి చార్జీలు ఇంటి కిరాయి దారు డు ఈ చార్జీలు చెల్లించాలా? యజమాని చెల్లించా లా? అనేది సమస్యగా మారిం ది. ఏడాది కాలంగా వినియోగించిన విద్యుత్ సర్వీసు సామార్థ్యాలను లెక్కగట్టి ప్రస్తుతం బిల్లులో ఏసిడిగా ముద్రిస్తున్నారు. వినియోగదారులు 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి వరకు 12 నెలల బిల్లులను మొత్తం కూడా 12తో బాగిస్తే వచ్చిన సగటు విలువ ను 2తో గుణిస్తారు. వచ్చిన మొత్తాన్ని అదనపు విని యోగడిపాజిట్ ఏసిడిగా బిల్లులో ముద్రించి వినియో గదారులపై భారాలు మోపుతున్నారు. నూతన సంవ త్సరం కానుకగా ప్రజలపై ఈభారాల మోపడం దా రుణమన్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజ లు పండుగ జరుపుకోవడానికి ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే అదనంగా భారం వేయడం అన్యా య మన్నారు. ఇప్పటికే ప్రజలకు పెరిగిన నిత్యావసర వ స్తువులతోటి ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క పై తాటికాయపడ్డ చందంగా ఏసిడి చార్జీలు మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఏసిడి చార్జీలను రదు ్దచేసి ఏసీబీ చార్జీలు చెల్లించకపోయినా విద్యుత్ బిల్లు ను తీసుకోవాలని కింది అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. లేనియెడ ల పార్టీ ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున ఆందోళన పోరాటా లు నిర్వహి స్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏం.చుక్కయ్య, మంద సంపత్, ధరావత్ భాను నా యక్ , తొట్టె మల్లేశం, రాజేందర్ ,యాకయ్య ,కిషోర్, వెంకట్, కుమారస్వామి, 100 మంది వినియోగ దారులు పాల్గొన్నారు.