Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పందించని సర్పంచ్ - పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-ఆత్మకూర్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దత్తత గ్రామమైన ఆత్మకూరు మండలం లోని గూడెప్పాడ్ గ్రామంలో గత వారం రోజులుగా నీళ్లు రాకపోవడంతో గ్రామ స్తులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గ్రామ ఎంపిటిసి బీరం రజనీకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మండలంలోని గూడె ప్పాడ్ గ్రామంలో పనిచేయని మోటర్ని బావిలో నుండి బయటికి తీసి బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడు బీరం రజనీకర్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాట్లాడారు. నీటి సమస్యపై గ్రామ సర్పంచ్ స్పందన లేకుండా ఉన్నప్పటికీ కనీ సం అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోయారు. అభి వృద్ధి ప్రదాత అని చెప్పుకొని నాయకులతో జేజేలు కొట్టించుకోవడం తప్ప అభివద్ధి ఎక్కడ కనబడడం లేదని ఎద్దేవ చేశారు.వేల కోట్లతో మిషన్ భగీరథ వంటి పథకాలు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం తప్ప ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు.కాంట్రాక్టులపై శ్రద్ధ పెట్టిన ఎమ్మెల్యేకు రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన గుణపాఠం గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.