Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అం దిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలు స్తున్నాయని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. గురువారం హనుమ కొండ లోని వారి నివాసం లో నడికుడ మండలంలోని వివిధ గ్రామాలకు చెం దిన ఆరుగురు బాధి తులకు గాను రూ.2,05, 500 ల విలువైన చెక్కులను లబ్ది దారులకు ఎమ్మెల్యే పంపి ణీ చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు అనంత రం అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో సీ ఎం కేసీఆర్ పేద ప్రజల అ భివృద్ధికిబాటలు వేస్తు కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిండి పోయా రన్నారు. బీఆర్ఎస్ ద్వారా దేశంలో మార్పు కోసం సీ ఎం కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, సర్పంచులు పాలకు ర్తి సదానందం, వంగ లక్ష్మీ రాజేందర్, సర్పంచులు, ఎంపిటిసిలు, భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.
దామెర : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరంగా మారిందని ఎమ్మెల్యే చర్ల ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని వారి నివా సంలో దామెర మండలానికి చెందిన ముగ్గురు లబ్ధి దారు లకు రూ.57వేల విలువ గల చెక్కులను వ్యాధి బారినపడిన వారికి అందించడం జరిగినది .ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల అభివద్ధికి బాటలు వేస్తూ కషి చేస్తున్నారని అన్నారు .
బిఆర్ఎస్ ద్వారా దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్. మండల దళిత బంధు చైర్మన్ కష్ణమూర్తి .సర్పంచ్ గట్ల విష్ణువర్ధన్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.