Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్
నవతెలంగాణ-శాయంపేట
మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనను పురస్క రించుకొని విద్యార్థి సంఘాల నా యకులను ముందస్తుగా పోలీ సులు అరెస్టు చేయడం అమానుష చర్య అని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అభివ ర్ణించారు. సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని విద్యార్థి సంఘాల నాయ కులను పోలీసులు ముందస్తుగా గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్య లను వెంటనే పరిష్కరించాలని, లేనియెడల అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కో వాల్సి వస్తుందని శ్రీకాంత్ హెచ్చరించారు.