Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
ఈ నెల 9 నుండి 11 వరకు నిర్మల్ జిల్లాలో జరిగిన 50వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచి దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక య్యారు. పాఠశాలకు చెందిన విద్యార్థినిలు బిందు, స్రవంతిలో 'మనకోసం గణి తం' అనే ఉపఅంశంపై సీనియర్ విభాగంలో 'ఎన్ కోడింగ్ డీ కోడింగ్'' 'అనే అం శాన్ని ప్రదర్శించి ప్రదర్శించినట్లు పాఠశాల హెచ్ఎం రంగారావు, గైడ్ టీచర్ బం డారి రమేష్ తెలిపారు. దక్షిణ భారత దేశ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థి నీలు ఈనెల 26న నుంచి 31 వరకు కేరళ రాష్ట్రంలో త్రిసుర్ లో జరిగే దక్షిణ భారత దేశబాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని గైడ్ టీచర్ రమేష్ తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు తతీయ బహుమతిని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నెక్కొండ ఎంపీపీ జాటోతు రమేష్, నెక్కొండ గ్రామ సర్పంచ్ యమునా రంజిత్‌రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ వడ్డే రాజు, పాఠశాల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయ బందము విద్యార్థులను గైడ్ టీచర్‌ను అభినందించినారు.