Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని గోపన పల్లి మల్లిఖార్జున స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్గా బెల్లం బాలరాజు ను నియమించారు. ఈ సందర్భంగా బా లరాజు మాట్లాడుతూ దేవాలయ అభివద్ధికి ఎమ్మెల్యే సహకారంతో ప్ర జా ప్రతినిధుల సహకారంతో కృషి చేస్తానన్నారు. అంతే కాకుండా ఈ దేవాలయం ఇన్ని రోజులు కోర్టు కేసులో ఉన్నందున అభివద్ధి ఏమి జ రగలేదని, ఇకపై గ్రామస్తుల సహకారంతో కోర్టు కేసులు అన్ని విర మించుకునేలా చూసుకుంటానని ఆయన అన్నారు. తద్వారా అభివద్ధి సాధ్యమని అన్నారు.ఐదుగురిని డైరెక్టర్లను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటిసి శింగులాల్,జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్, స ర్పంచులు పంజా మహేష్, రమేష్ తోటి దేవేందర్,సొసైటీ చైర్మన్ గొ ర్రె దేవేందర్,టి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్, ఉప సర్పంచ్ అశోక్ ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.