Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు 4 ప్రాజెక్టులు ఎంపిక
నవతెలంగాణ-భూపాలపల్లి
నిర్మల్ జిల్లాలో ఈనెల 8,9,10,11 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి 50వ వైజ్ఞానిక పర్యావరణ ప్రదర్శన, ఇన్స్పైర్ మానక్ -2023 ప్రదర్శనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభంజనం సృష్టించింది. 3 ఇన్స్పైర్ ప్రదర్శనలను, 14 సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలను, ఒక టీచర్ ఎగ్జిబిట్ ప్రదర్శించారు. ఇందులో 4 ప్రదర్శ నలు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి. జిల్లా కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలకు చెందిన ఏ సోనీ కష్ణ, వశిష్ఠ గివ్ ప్లాస్టిక్ -టేక్ పెట్రోల్ అనే ప్రాజెక్టు, జిల్లా కేంద్రంలోని మైనార్టీ పాఠశాల చెందిన బి శివ యాదవ్, ఎండి రిజ్వానా కోడింగ్ -డీకోడింగ్ అనే ప్రాజెక్టు, కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్తి కే యశ్వంత్ లై- ఫై టెక్నాలజీ అనే ప్రాజెకు, మహ ముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్ పాఠశాల చెందిన ఈ శశిధర్ రూపొందించిన మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యాయి. ప్రతిభ చాటిన విద్యార్థులను రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంస పత్రాలు మెమొంటోతో సత్కరించారు. జాతీయ స్థాయికి ఎన్నికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, గైడ్ టీచర్లు, విద్యార్థులకు డీఈఓ ముద్దమల్ల రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి బి స్వామి అభినందించారు.
మాంటిస్సోరి విద్యార్థులకు అభినందన
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో జిల్లా కేంద్రానికి చెందిన మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఈనెల 28న కేరళ రాష్ట్రంలోని తిరువూచి లో జరిగే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో పాల్గొననున్నారు. సదరు విద్యార్థులు సోను కృష్ణ, వశిష్ఠతోపాటు గైడ్ టీచర్స్ శివకుమార్‌ను మాంటిస్సోరి పాఠశాల చైర్మన్ జోష్ నెడుతుడున్, అధ్యక్షుడు గండ్ర సుధాకర్ రెడ్డి, కరస్పాండెంట్ సీన్ జోష్, డైరెక్టర్లు హరీష్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు బిన్ను, అనిల్, జేమ్స్ అభినందించారు.
మండల ఆదర్శ విద్యార్థి ఎంపిక
కాటారం : 50వ రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శన(ఆర్బివిపి)లో మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ విద్యార్థి కీర్తి యశ్వంత్ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ప్రథమ బహుమతి సాధించాడు. గురువారం రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... యశ్వంత్‌ను అభినందించి అవార్డు అందజేశారు. ఈనెల 27 నుంచి కేరళలో జరిగే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో యశ్వంత్ పాల్గొనున్నారు. యశ్వంత్, గైడ్ టీచర్ బీఏ రావును డీఈఓ రాజేందర్, డిఎస్ఓ స్వామి, ఆదర్శ స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్‌రావు , కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కషిత అభినందించారు.