Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడాప్రాంగ ణాలు, పల్లె ప్రకతి వనాపలు ఉండేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 241 గ్రామపంచాయతీల్లో 45 గ్రామా లలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సమస్యలు ఉన్నా యని, పరిష్కరించి వాటి ఏర్పాటుకు కషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాం గణం నిర్మాణానికి అనువైన స్థలాలను నెలాఖరులకు ఎంపిక చేయాలని ఆదేశించారు. పెండింగ్ క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. అన్ని మండలాల్లో రేపు సాయంత్రం వరకు తాసి ల్దారులు మండల పంచాయతీ అధికారులు ఏపీవోలు ఎంపీడీవోలు ఎంపిక చేసిన స్థలాల వివరాలు సమర్పించాలని సూచించారు. ఎంపిక చేసిన స్థలా లను ఉపాధి హామీ కార్మికులను వినియోగిస్తూ గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని, 31 జనవరి 2023 చివరి నాటికి 300 పైగా గ్రామీణ క్రీడా ప్రాంగణాలు గ్రౌండింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. నిధుల సమస్యలు ఉన్న గ్రామపంచాయతీలలో మెటీ రియల్ కాంపోనెంట్ కొనుగోలుకు కలెక్టరేట్ నుండి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఉపాధి హామీ నిధులు వచ్చిన తర్వాత రీయంబర్స్ చేయాల్సి ఉం టుందన్నారు. అవసరమైన గ్రామపంచాయతీలో నుంచి తీర్మానం, ప్రతిపాదనలు తీసుకోవాలని ఆదే శించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దివాకర్, డీఆర్డీఓ పీడీ పురుషోత్తం, జెడ్పీటీసీఈఓ రఘువరన్, తాసిల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, తదితరులు పాల్గొన్నారు.