Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని, బడి మానిన పిల్లలను బడిలో చేరేలా ప్రతి ఒక్కరు కషి చేయాలని బాలల సంరక్షణా అధికారి హరికష్ణ తెలి పారు. గురువారం మండల పరిధి పాత్రాపురం, అలు బాక రైతు వేదికల వద్ద అవగాహన సదస్సులు ఏర్పా టు చేశారు. ఆపరేషన్ స్మైల్-9లో భాగంగా మండ లంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం ప్రారంభమైందని అ న్నారు. మండల వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తిం చి వారిని తిరిగి బడికి పంపిస్తున్నామన్నారు. మం డలంలో ఎక్కువగా పిల్లలు మిరప తోటల పనుల్లో ఉన్నటు గుర్తించామన్నారు. సదరు రైతులకు బాల కార్మిక నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తు న్నామని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ టీం సభ్యుడు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.