Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు మహబాద్ పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, యువజ న ప్రజా సంఘాల నాయకులను రాత్రి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి అక్రమంగా ఇళ్లలోకి చొరబడి అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్రసమితి సభ్యులు బందు మహేందర్ ఆరోపించా రు. తొర్రూరు డివిజన్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు బందు మహేందర్ ను, కాంగ్రెస్ యూత్ నాయకులు కనుకుంట్ల కుమారస్వామి. అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు.అదుపులోకి తీసుకో వడం అనైతిక చర్య, నాయకులు పోలీసుల కస్టడీలో ఉంటే తప్ప కెసిఆర్ జిల్లాలోకి అడుగుపెట్టలేకపో తున్నాడంటే ప్రభుత్వ యంత్రాంగా పనితీరు, ప్రజా సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి కేసీఆర్ అత్మవిమర్ష చేసుకోవాలని ఆయన విమర్శించారు. బేషరతుగా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని ఇప్పటికైనా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించి విద్యారంగ సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆ సమస్యలు పరిష్కరించి ప్రజా సమస్యలపై దష్టి సారించి పరిష్కారం చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
అక్రమ అరెస్ట్‌లతో పోరాటాలను ఆపలేరు
కొత్తగూడ : అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చేస్తున్న అక్రమ అరెస్ట్ లతో ప్రజలకోసం చేస్తున్న మా పోరాటాలను ఆపలేరని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రూప్ సింగ్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మానుకోట జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్నందున బుధవారం అర్ధరాత్రి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారని అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం చేస్తున్న దమనకాండ రాజకీయాలను ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఈ స మావేశంలో కిసాన్ మజ్దూర్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్య క్షులు ఉళ్లేంగుల రమేష్, ఎన్ఎస్ యూఐ మండల అ ధ్యక్షులు బానోత్ వినోద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయ కులు విరనేని వెంకటేశ్వర్లు, నాయకులు ప్రశాంత్, కట్రోజు బిక్షపతి, నరసింహ, ప్రవీణ్, నరేష్, వెంకన్న, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం నాయకుల ముందస్తు అరెస్టులు
గార్ల : మహ-బాద్ జిల్లా కేంద్రం లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారం భించేం దుకు సియం కేసీఆర్ గురువారం ముఖ్య అతిధిగా హజరు అయిన సందర్భంగా తెల్లవారుజా ము నుండే అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేసి స్టేషను లో నిర్బంధించారు.సియం కేసీఆర్ మాను కోట పర్యటన సందర్భంగా ఎలాంటి అందోళన లు,అల్లర్లు చోటు చేసుకో కుండ బుధవారం రాత్రి నుండే పోలీసులు అఖిలపక్షం పార్టీల నాయకులను ముందస్తుగా అరె స్టులు చేసి డోర్నకల్ పోలీసుస్టేషనులో ఉంచా రు. అరెస్టు అయిన వారిలో నాయకులు కట్టెబోయిన శ్రీని వాస్, జి.సక్రు, ధనియాకుల రామారావు, ఆర్. విమ ల్‌కుమార్ జైన్,ఠాకూర్, జగదీష్, లోకేష్ ఉన్నారు.
వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన వారు అరెస్టు
మండలంలోని రాంపురం పాకాల ఏటి పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కు నిధులు మంజూరు చేయా లని కోరుతూ మాను కోట జిల్లా కేంద్రం లో నూత నంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారం భానికి వచ్చిన సియం కేసీఆర్ కు వినతిపత్రం అందించేందుకు వెళ్ళిన సిపిఎం, న్యూడెమోక్రసి పార్టీ ల నాయకులు కందునూరి ఈశ్వర్ లింగం, జడ సత్య నారాయణ లను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రం లోని పోలీసు స్టేషను లో ఉంచారు.
అక్రమ అరెస్టు లు అప్రజాస్వామికం
సమస్యలను పరిష్కరించాలని సియం కేసీఆర్ కు వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న అఖిలపక్షం నాయకులను పోలీసులు ముందస్తు గా అరెస్టు లు చేయడం అప్రజాస్వామికం అని సిపిఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, తెలంగాణ గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్య హరి నాయక్‌లు గురువారం ఖండించారు.
కొత్తగూడ : ఆదివాసీ నాయకుల అక్రమ అరెస్ట్ లు అప్రజాస్వామికం అని ఆదివాసీ ప్రజాసంఘాల కమిటీ కన్వీనర్ కుంజ నర్సింగరావు అన్నారు. ఆదివాసీ నాయకుల అరెస్ట్ లకు నిరసన గురువారం మండలకేంద్రంలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహ బూ బాబాద్ జిల్లా , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటనకు వస్తున్న సందర్భంగ ఆదివాసీ సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సబబు కాదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పని చేసే ప్ర భుత్వ అదినాయకుల పర్యటన సందర్భంగ ఆదివాస ీల ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి ప్రజా సమస్యలు ఏకరవు పెట్టె ఆదివాసీ ప్రజా, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయించి ప్రజల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం అంటూ ఉదర కొట్టే మాటలు చెప్పడం రాష్ట్ర ముఖ్యమంత్రి కి అలవాటుగా మారిందని విమర్శించారు.రాష్టం లోని ఆదివాసీలను అదోగతి పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఆదివాసీల సత్త ఏమిటో చూపెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ లు వజ్జ రవి , సిద్దబోయిన సంజీవరావు, పూనెం సందీప్ , సిద్దబోయిన కిషోర్ ,అలెం జంపయ్య తదితరులు పాల్గొన్నారు.