Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే బిఆర్ఎస్ బహిరంగ సభకు సియం కేసీఆర్ హజరు అవుతున్నారని, ఈ సభకు బిఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలి రావాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా, ఎమ్మెల్సీ తాత మధు సూదనరావులు అన్నారు. స్దానిక వర్తక సంఘం భవనంలో శుక్రవారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు.ఆంధ్ర పాలకుల హయాంలో వెనుక బడిన తెలంగాణ రాష్ట్రాన్ని సియం కేసీఆర్ అన్ని రంగాలలో తెలంగాణ ను అభివృద్ధి చేశారని, దేశంలో ప్రజలకు మరింత సేవలు అందిస్తూ బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలో కి తీసుక వెళ్ళి ప్రతీ గ్రామం నుండి భారీ సంఖ్యలో ప్రజలను ఖమ్మం బహిరంగ సభకు తరలించాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ రావు, నాయకులు వెంకటరమణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, జడ్పీటీసి జాటోత్ ఝాన్సీ లక్ష్మీ, సర్పంచ్లు అజ్మీర బన్సీలాల్,భూక్య మోతీలాల్, రాత్నవత్ శంకర్, శ్రీను, ఎంపిటీసిలు శీలంశెట్టి రమేష్, కో-అప్షన్ సభ్యులు ఖధీర్, నాయకులు పానుగంటి రాధాకృష్ణ, మీగడ శ్రీను, బి.బాలు, ఆర్.శంకర్, బి.లక్ష్మారెడ్డి, వి.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ ఉన్నారు.