Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో డిగ్రీ ప్రథమ సం వత్సరంలో అడ్మిషన్లు పొందుటకు 2023 తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యు యేట్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రాంతీయ సమన్వయ అధికారి డీఎస్ వెంకన్న, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.హరిప్రియ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతూ 2023లో పూర్తిచేసే అభ్యర్థులు అర్హులని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాలలో రెండు లక్షలు ఉండాలని, బీకాం (సిఏ), బీకాం (జి), బిఏ ( హెచ్ఇపి), బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఎస్సీ (ఎంఎస్టిసిఎస్), బీఎస్సీ (ఎంజెడ్సి), బిఎస్సి (బిజెడ్సి), తదితర గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయని, అర్హులైన విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.