Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
హన్మకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలిమాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను శుక్రవారం లింగాల ఘణ పురం మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు, యాదవ కులస్తు లు మర్యాద పూర్వకంగా కలిసి, యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణా మంజూరు కోసం వినతి పత్రాన్ని సమర్పించారు. దానికి ఎమ్మెల్యే రాజయ్య సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ కత్తుల శ్రీపాల్ రెడ్డి, పెద్దగొల్ల సంఘీ యాదయ్య, గొల్లదండిగ పర్వతాలు, మాజీ సర్పంచ్ సంగీ రాజు రజిత, ఉపసర్పంచ్ గువ్వల రవి, జనగా మ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దండిగా మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు దండిగ సత్యనారాయణ, సంగీ పాపయ్య,జీడికల్ దేవస్థానం డైరెక్టర్ దండిగ ఐలయ్య, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ దండిగ నరసింహులు, గ్రామ సీని యర్ నాయకులు దడిగే రాములు, దండిగా నరసింహులు, దండిగా మల్లయ్య, దండ్రాకుల లింగయ్య, దుప్పటి రాములు పాల్గొన్నారు.