Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత పెడదరిన పడ కుండా క్రీడలను అలవాటు చేసుకొని రాణించి తల్లిదండ్రులకు గొప్ప పెరు తేవా లని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శుక్రవారం నర్మెట మండల కేంద్రంలోనర్మెట్ట గ్రామ సర్పంచ్ ఆ మెడపు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామస్థాయి క్రికెట్ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరై ప్రారంభించారు. నర్మెట్ట సర్పంచ్ కమలాకర్ రెడ్డి సహకారంతో స్థానిక యువతకు 230 టీ షర్ట్స్‌ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల యువత, చిన్న పిల్లలు మొబైల్ గేమ్స్‌కు అల వాటు పడ్డారని, మొబైల్ గేమ్స్ వల్ల మేధస్సు క్షిణించి అనారోగ్య బారిన పడుతు న్నారని, యువత ఫిజికల్ ఆక్టివిటీస్‌లో ముందుడాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత కింది సురేష్, గ్రామ అధ్యక్షులు నక్కల రవి, వార్డు సభ్యులు కన్నబోయిన ఆంజనే యులు, ముక్కెర మహేందర్, పొన్నం బాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు గడ పురం శశిరత్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.