Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
నా మూపై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికి తలవంచలేదు, భయపడేది లేదు, ఎవరి పాదాభివందనం చేసేంది లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల కురుమ సంఘం వారి అధ్వర్యంలో నిర్వ హించిన నూతన కురుమ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తదుపరి సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ కురుమలు కాలానికి అనుగుణంగా మార్పుచేందాలన్నారు.కురుమ చదువు కోవాలని అప్పుడే ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. నూతనంగా ఏర్పడి న మండల కురుమ సంఘానికి శుభాకాంక్షలు తెలియ చేస్తూ వారికి (కురుమ సంఘానికి) తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. తాను ఈస్థాయికి ఎదిగి ఇలా ఉన్నాను అంటే తాను చదువుకోవడం వలనే అని, చదువు ప్రతి ఒక్కరికీ విలువలను నేర్పుతుందని, కురుమ సంఘ బిడ్డలందరూ కూడా చదువుకోవాలని, నీతి నిజాయితీ పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కురుమ సంఘం వారు తమకు సంఘ భవనం కావాలని కోరగా తమ రాబోయే సి.డి.పి నిధుల నుండి మంజూరి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమనోహర్, ఎంపిటిసి భిక్షపతి, కురుమ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి, నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపరాణిభూపాల్ రెడ్డి, సభ్యులు, మదార్, వీరసాయి మల్లేశం, వీరస్వామి, శేఖర్, నాయకులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.