Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రమాదం బారిన పడ్డ మూగజీవాలను రక్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన జంతు ప్రేమికురాలు, 'నేనుసైతం' స్వచ్చంద సేవా సంస్థ సభ్యురాలు మహ్మద్ సుమ ఈసారి సర్పాలను రక్షించి వాటికి స్వేచ్చను కల్పించారు. పట్టణంలోని శ్రీనివాస టాకీస్ ఎదుట శుక్రవారం పాములను బంధించి గారడి పేరిట ఓ వ్యక్తి మూలికలు విక్రయిస్తుండడాన్ని గ్రహించి నిలదీశారు. మూగజీవాలను బంధించి వాటి ద్వారా వ్యాపారం చేయడం శిక్షార్హమంటూ ఆగ్రహించారు. జిల్లా అటవీశాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమా చారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని పాములను స్వాదీన పరుచుకొని, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.వారివాహనంలో జమాండ్ల పల్లిలోని దట్టమైన అటవీప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి చేతుల మీదుగానే పాములను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎఫ్.ఆర్.వో. కె. జోష్నాదేవి మాట్లాడుతూ మూగజీవాలను బందించి హింసిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులను చట్టరిత్యా కఠినంగా శిక్షిస్తామన్నారు. మరోమారు సర్పాల ద్వారా మూలికల వ్యాపారం చేస్తే కేసునమోదు చేస్తామని గారడీ దందాదారుడిని హెచ్చ రించారు. సమాచారం ఇచ్చి తన బాధ్యతను నిర్వర్తించిన సుమను ఆమె ఈ సంద ర్భంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ సుమను స్పూర్తిగా తీసుకొని హింసకు గురవుతున్న మూగజీవాలను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని పిలుపు నిచ్చా రు. అనంతరం సుమ మాట్లాడుతూ ఎవరు,ఎక్కడ, ఏజంతువును బంధించి హిం సిస్తున్నట్లు దృష్టికి వచ్చినా అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందిం చాలని కోరారు. స్పందించిన జిల్లా అటవీశాఖ అధికారులకు సుమ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాండ్లపల్లి డీఆర్వో. కె.రీనా, ఎఫ్బీవో బి. ల , ఎస్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.