Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాగ్రత్తలు పాటించండి - ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవ తెలంగాణ-మహాబూబాబాద్
సంక్రాంతి పండుగకు ఇళ్లకు తాళం వేసి సొంతూళ్లకు వెళ్లే వారి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక సూచనలు చేశారు. పండుగకు ఇంటికి తాళం వేసి వెళితే దొంగలు చోరీ చేసే ప్రమాదం ఉందని జాగ్రత్త లు తీసుకోవాలని ఎస్పీ ఒక ప్రకటనలో సూచిం చారు. ప్రజలు విలువైన వస్తువులు, ఆభరణాలు తాళం వేసిన ఇంట్లో పెట్టుకోకూడదని.. బ్యాంకు ల్లో భద్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళాలు ఉపయోగించుకోవాలన్నారు. సంక్రాంతి నేపథ్యంలో దొంగతనాల నియంత్రణకు పోలీసు గస్తి నిరంతరం ఉంటుందన్నారు. ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు.అలాగే మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకుగానీ, డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను మొబైల్లో చెక్ చేసుకుంటూ ఉండటం మంచిదని అన్నారు. ఇంటి ముందు న్యూస్‌పేపర్స్, పాలప్యాకెట్లు జమ కాకుండా చూసుకోండి. దీని ద్వారా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి దొంగలు చోరీకి పాల్పడే అవకాశం ఉందన్నారు. లైట్లువేసి ఉంచండి,మెయిన్ డోర్‌కు తాళ కనిపించకుండా కర్టెన్స్‌తో కప్పి ఉంచండి అన్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు విలువైన వస్తువు లు, ఆభరణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, ప్రయాణాలు చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తినడానికి ఏమైనా ఇస్తే తిరస్కరించాలని సూచించారు. పండుగ సమయంలో దొంగలు విషయంలో అత్యంత అప్రమత్తం గా లేకపోతే నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.