Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కును ప్రయివేటు కంపెనీలకు కట్ట బెడితే చూస్తూ ఊరుకోం - సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం ముందుకు రానందున బయ్యా రంలో జిందాల్ కంపెనీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సంపూర్ణంగా సహకరిస్తామని, వారికి అన్ని రకా ల సహాయ సహకారాలు అందజేస్తామని, రాష్ట్ర మం త్రి కేటీఆర్ జిందాల్ సంస్థ యండీ సజ్జన్ జిందాల్‌కు హామీ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రయి వేటు కార్పొరేట్ కంపెనీ అయిన జిందాల్ బయ్యా రంలో ఉక్కు పరిశ్రమ పెడితే ఈ ప్రాంత ఆదివాసీ లకు, స్థానికులకు కలిగే ప్రయోజనమేమిటో కేటీఆర్ చెప్పాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్య దర్శి గౌని ఐలయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో విలేఖరు లతో ఆయన మాట్లాడారు. ఆమోద, రక్షణ కంపెనీ లకు గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బయ్యారం ఉక్కును అప్పగిస్తే తెలంగాణ ప్రజలు పోరాడి దానిని రద్దు చేయించారని, రక్షణ స్టీల్స్ ఒప్పందాన్ని రద్దు చేయించింది జిందాల్‌కు యివ్వటానికి కాదని కేటీఆర్ కు గుర్తించాలన్నారు. ప్రయివేటు కంపెనీకి ఇవ్వటం వలన ఉద్యోగాలలో రిజర్వేషన్లురావని, ప్రజలకుగాని, ప్రభుత్వాలకుగాని ఎలాంటి లాభం జరగదని ఆయన అన్నారు. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం బయ్యా రం ఉక్కు పరిశ్రమకు నిర్దిష్ట హామీ యిచ్చినా బీజేపీ ప్రభుత్వం దానిని అమలు చేయటానికి సిద్దంగా లేద ని,దానిని సాకుగాచూపి టిఆర్ఎస్ ప్రభుత్వం బయ్యా రం ఉక్కును ప్రయివేటు వాళ్ళకు కట్టబెట్టడానికి పూనుకొంటున్నదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెయిల్ ముందుకు రాకపోతే జిందా ల్కు యిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కేటీఆర్ కూ డా అదే మాట్లాడుతున్నాడని, ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని, దీనిని తెలంగాణ ప్రజలు అంగీ కరించరన్నారు. లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడ ిజైన్, 60వేల కోట్లతో మిషన్ భగీరథ లాంటి పథకా లు తెచ్చామని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్ ప్రభు త్వం 30,40 వేల కోట్లతో బయ్యారం ఉక్కు పరిశ్రమ ను ఏర్పాటు చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ కోసం అందరినీ కలుపుకొని కేంద్రం పై కేసీఆర్ ఎందుకు పోరాడటం లేదో తెలపాలని, ప్రయివేటు వాళ్ళ కివ్వడం కోసమే కేంద్రంతో దోబూ చు లాడుతున్నాడని ఐలయ్య అన్నారు.జిందాల్‌కు గాని, మరే ప్రయివేటు సంస్థలకు గాని బయ్యారం ఉక్కును కట్టబెడితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, కేటీఆర్ ప్రకటనను వెంటనే ఉపసంహరించు కోవా లని ఆయన డిమాండ్ చేశారు.ఈసమావేశంలో పార్టీ జిల్లా నాయకులు మదార్, మాజీ సొసైటీ చైర్మెన్ రామగిరి బిక్షం, పీవైఎల్ రాష్ట్ర నాయకులు తుడుం వీరభద్రం, గ్రామ నాయకులు కూనూరి యుగంధర్, శేషు, కొదుమూరి వీరభద్రం, జెర్రిపోతుల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.