Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మహా భాగవత గ్రంథకర్త పోతన స్ఫూర్తితో బొమ్మలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండ లంలోని బమ్మెర గ్రామానికి చెందిన కొత్తోజు నాగాచారి దంపతులు బొమ్మెర బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన పోతన విగ్రహాన్ని ఎమ్మెల్సీ కడియం శ్రీహ రితో కలిసి మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ బొమ్మెర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మరో బాసరగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పి టిసి పుస్కురి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ జలగం నాగభూషణం, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఉప సర్పంచ్ శివరాత్రి సుధాకర్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బత్తిని గోపాల్ గౌడ్, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ ధార శంకరయ్య, టిఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు శివరాత్రి (కాజీపేట) సోమయ్య, గ్రామస్తులు గుడికందుల నరేష్, జోగు గోపి, జిట్టబోయిన కొమురెల్లి, బత్తిని మద న్మోహన్, వెన్నకూస యాకయ్య తదితరులు పాల్గొన్నారు,