Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామీణ క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు చేయూత నిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మండలంలోని వావిలాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను ఆ గ్రామ సర్పంచ్ గంట పద్మ భాస్కర్, మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంటరవీందర్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారం భించారు. ఈసందర్భంగా మంత్రి కబడ్డీ కబడ్డీ అంటూ కూతబెట్టి, ఆటను ప్రారం భించారు. అనంతరం మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ కబడ్డీ ఆటలోనూ, వాలీబాల్ ఆటలోనూ, ఫుట్‌బాల్ ఆటలోనూ తాను కెప్టెన్‌గా ఉన్నానని, ఆటలంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు ఆటలను ఆడాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని క్రీడాకారులలో స్ఫూర్తిని రగిలిం చారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీముల క్రీడాకారులకు అభినం దనలు తెలిపారు, ఆటలు ఆడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడాకారులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యం అని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కబడ్డి క్రీడను, ఆటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామానికి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, 1ఎకరం భూమి కేటాయించామన్నా రు. గంట అభినయ సాయిరాం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఆడబోతున్నా రని, ఈ సందర్భంగా అతడికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఆటల్లో గెలుపు ఓటములు తప్పవని ఓడిపోతే బాధ పడకుండా ఛాలెంజ్‌గా తీసుకుని ఆడాలన్నారు. అంతకుముందు కబడ్డీ క్రీడాకారులను మంత్రి ఎర్రబెల్లి పరిచయం చేసుకున్నారు. అనంతరం సర్పంచ్ గంటా పద్మ భాస్కర్లతోపాటు మహాత్మా హె ల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట అరవింద్ మంత్రి ఎర్రబెల్లిని ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారుపో తుల వేణు, వావిలాల గ్రామ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ముత్తినేని కర్ణాకర్, శిలా లింగయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.