Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానుకోటలో కేజీ టు పీజీ బాలికల విద్యా సంస్థ - ఇంజనీరింగ్ కళాశాలకు పది ఎకరాల భూసేకరణ
ఖమ్మం బహిరంగ సభకు లక్ష ఇరవై వేలమంది - మానుకోట సీఎం సభ సక్సెస్ కృతజ్ఞతాభివందనాలు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్య మంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు, మున్సిపాలిటీలకు 125 కోట్లు, ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షలు మంజూరు మంత్రి సత్యవతి రాథోడ్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.శుక్ర వారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సత్యవతి రాత్రి మాట్లాడారు. సీఎం పర్యటన విజయవంతం చేసిన అధికార యంత్రాం గానికి, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, అన్నివర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.అన్నిరంగాల్లో వెను కబడిన మానుకోటకు కెసిఆర్ ఎన్ని నిధులైన ఇవ్వడా నికి సిద్ధంగా ఉన్నారని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ కంకణబద్దుడై ఉన్నాడని మంత్రి అన్నారు.
10 ఎకరాల స్థల సేకరణకు ఆదేశం
మహబూబాబాద్‌లో నూతనంగా నిర్మించబోయే గురుకుల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కోసం పది ఎకరాలు స్థల సేకరణ చేయాలని కెసిఆర్ జిల్లా కల ెక్టర్ను ఆదేశించారని తెలిపారు. గతంలో ఈ ప్రాం తంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాల కనీస సౌక ర్యాలులేక ఇతర ప్రాంతానికి తరలిపోయిందని అన్నా రు. ఇప్పుడు అలా కాకుండా ఇంజనీరింగ్ కళాశాలను అత్యాధునికంగా అన్ని కోర్సులతో రాష్ట్రస్థాయిలో నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కళాశాలను తరగతులు ప్రారంభిస్తామని అన్నారు.అలాగే మానుకోటలో బాలి కల కోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంతంలో ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు కోసం కృషి జరుగుతుందని తెలిపారు.ఈకళాశాల వస్తే ఈ ప్రాం త గిరిజన బిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉం టుందని అన్నారు. మానుకోటకు ఇప్పుడే రెండు జాతీ య రహదారులు ఉన్నాయని, మరో జాతీయ రహదా రిని కలుపుతూ ఇల్లందు రోడ్ నుంచి సాలార్ తండ మీదుగా ఎస్పీ కార్యాలయం వరకు రింగురోడ్డు ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలో గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి పనులు కూడా ప్రారంభం అవు తాయి అని తెలిపారు.కొరవి మండలం గుండాదిమ డుగు సమీపంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూ మి ఉందని, అక్కడ అక్కడ స్పెషల్ ఎకనా మిక్ జోన్ ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది నిరుద్యోగు లకు ఉపాధి కల్పించే ప్రణాళిక ఉందని తెలిపారు. అలాగే డోర్నకల్ నుంచి నల్గొండ ప్రత్యేకరైలు మార్గం కోసం కెసిఆర్ గ్రీన్ సిగల్ ఇచ్చారని తెలిపారు.
ఉక్కు పరిశ్రమ కోసం కేటీఆర్ కృషి
మహబూబాబాద్‌లో ప్రత్యక్షంగా 10,000 మం దికి పరోక్షంగా 30000 మందికి ఉపాధి కల్పించే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బొంబాయి నగరంలో జిందాల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్లు మంత్రి సత్యవతి రాత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విభజన హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ఎకరాల ఐర న్ భూముల నుంచి రక్షణ స్టీల్‌కు, వైజాగ్ స్టీల్‌కు మట్టిని తరలించారని, ఇప్పుడు ఆమట్టి ఎందుకు పని కి రాకుండా పోయిందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ములుగులో గిరిజన యూనివర్సిటీ,కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో బిజెపి విఫలమైం దని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే బిజెపికి పుట్టగతులు ఉండవని, ఈ ప్రాంతంలో ఓటు అడిగే అర్హత ఉండదని తెలిపారు. బిజెపి ప్రభుత్వం ద్రోహిగా, ఆ పార్టీ నాయకులు ద్రోహులుగా మిగిలి పోతారని అన్నారు. గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా కేంద్రం ద్రోహం చేసిందని జీవో నెంబర్ 3ని కొట్టి వేసిందని విమర్శించారు.
ఖమ్మం సభకు లక్ష ఇరవై వేల మంది
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న నిర్వ హించే భారీ బహిరంగసభకు మహబూబాబాద్ జిల్లా నుంచి లక్ష ఇరవై వేల మందిని తరలించాలని కేసీ ఆర్ ఆదేశించినట్లు సత్యవతి తెలిపారు. ఇందులో మహాబూబాబాద్ నియోజకవర్గ నుంచి 40 వేల మం ది, డోర్నకల్ నియోజకవర్గం నుంచి 50 వేల మంది, ఇతర మండలాల నుంచి 30 వేల మందిని తరలిం చనున్నట్లు తెలిపారు. జనతరలింపు కోసం డోర్నకల్ నియోజకవర్గానికి మంత్రి దయాకర్, ఎంపీ మాలోత్ కవిత ఇన్చార్జిగా ఉంటారని, మానుకోట నియోజక వర్గానికి తనతో పాటు నూకల నరేష్ రెడ్డి ఇన్చార్జిగా ఉంటారని తెలిపారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి ఇన్చార్జిగా ఉంటారని తెలిపారు.మహబూబాబాద్ మండలానికి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గూడూరు మండలానికి మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఇన్చార్జిగా ఉంటారని,మిగిలిన మం డలాలకు త్వరలో ప్రకటిస్తామన్నారు.