Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు లక్షలకు పైగా తరలిరానున్న భక్తులు
- భారీగా పోలీసులతో బందోబస్తు
నవతెలంగాణ-ఐనవోలు
శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం 2023 సంవత్సరం జాతర బ్రహ్మౌత్స వాలకు ధ్వజారోహణ కార్యక్రమంతో అంకురార్పణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రం లోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మౌత్సవాలు శుక్రవారం ప్రారంభమైనాయి. ఉత్స వాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనను న్నారు. ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు భక్తు లు మల్లికార్జునస్వామి ని దర్శించుకుంటారని అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలుఏర్పాట్లు చేశారు. సీపి వరంగల్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేశా రు. జాతర సమయంలో తప్పిపోయిన వారి ఆచూకీ తెలిపే విధంగా మైక్ సెట్ల ను అమర్చారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వాహనాలను నిలపడం కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశారు. దేవాలయం చుట్టు ప్రక్కల క్యూ లైన్లు ఏర్పా టు చేశారు.14న శనివారం భోగి, 15న మకర సంక్రాంతి బండ్లు తిరుగుట,16న సోమవారం కనుమ శ్రీ స్వామివారి దర్శనాలు ఉంటాయి. ఫిబ్రవరి 5వ ఆదివారం రేణుకా దేవిఎల్లమ్మ పండుగ, 18న శనివారం మహాశివరాత్రి శివ కళ్యాణం లిం గోద్భవము పెద్దపట్నం, 19న ఆదివారం ఒగ్గు పూజారులుచే పెద్దపట్నం స్వామి వారి దర్శనం ఉంటుందని నిర్వహణ అధికారులు తెలిపారు.