Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఐదవ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న రంగారెడ్డి జిల్లా మన్నెగూడ కు హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల బాధ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అందులో ఒక బందం హనుమకొండ డీఈవో కార్యాలయం నుంచి రాష్ట్ర మహాసభలకు తరలి వెళ్లారు. మహాసభలకు వాహనాల శ్రేణిని రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ జెండా ఊపి ప్రారం భించారు. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో విద్యారంగ ,ఉపాధ్యాయ సమస్యలపై చర్చిస్తారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర వి ద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ మరియు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్లు తదితరులు పాల్గొంటారని టీఎస్ యుటిఎఫ్ నాయకులు తెలిపారు. మహాసభలకు తరలి వెళ్ళిన వారిలో హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం సదాశివరె డ్డి, పెండెం రాజు వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటికాయల కు మార్, బద్దం వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు సిహెచ్ రవీందర్ రాజు, కోశాధికార కిరణ్ కుమార్, సి సుజన్ ప్రసాద్ రావు ఏం అన్నా దేవి కార్యదర్శులు సిఎస్ఆర్ మల్లిక్, కే.మోజేష్ జి భాస్కరరావు , పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.