Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.4 లక్షల ఆస్థి నష్టం
నవతెలంగాణ-శాయంపేట
ఇంట్లోని ఇన్వర్టర్ బ్యాటరీ పే లి ఇల్లు అంటుకొని భారీ అగ్ని ప్ర మాదం చోటు చేసుకున్న సంఘట న సోమవారం మండలంలోని గట ్లకనిపర్తి గ్రామంలో చోటుచేసుకుం ది. ఈ ఘటనలో రూ.1లక్ష నగదు, రూ.3 లక్షల ఆస్థి నష్టం సంభవిం చినట్లు బాధితుడు బస్వోజు శ్రీని వాస్ తెలిపారు. బాధితుడి కథనం ప్రకారం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన ఇంట్లోనే ఆ న్లైన్ సెంటర్, కంగన్ హాల్, కులవత్తిలో భాగంగా బంగారం పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇం టికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కొత్తకొండ జాతరకు బయలుదేరి వెళ్లా రు. ఇంట్లోని ఇన్వర్టర్ పేలి ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పరకాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో శకటం వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. స్థానిక సర్పంచ్ బొమ్మకంటి సాం బయ్య, ఉపసర్పంచ్ బోడ కుంటి సురేష్ తో పాటు గ్రామస్తులు మంటలను చల్లా ర్చేందుకు సహకరించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో దాచుకున్న లక్ష రూపా యలనగదు, కంప్యూటర్ లాప్టాప్ కంగన్ హాల్ సామాగ్రి బట్టలు నిత్యవసర వ స్తువులు కాలిపోయి బూడిద అయ్యాయి. సంఘటన స్థలాన్ని ఆర్ఐ శరత్ కుమార్ చేరుకొని పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవా లని స్థానిక సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య, ఎంపిటిసి బత్తిని రజని సత్యనారా యణ, కో-ఆప్షన్ సభ్యులు గుర్రం అశోక్ కోరారు.