Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పి తూర్పు కోఆర్డినేటర్ ఇర్ల కుమార్
నవతెలంగాణ-కాశిబుగ్గ
అనాధ పిల్లలకు ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని మహాజన సోషలిస్ట్ పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ కోరారు. 19వ డివిజన్ సొసైటీ కాలనీ లోని మదర్ తెరిసా అనాధ ఆశ్రమ పిల్లలకు సోమవారం ఈర్ల కుమార్ పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధ పిల్లలకు ఆధార్ కార్డ్, పెన్షన్ సౌకర్యాల కోసం, వా రి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశ్ర మ ప్రిన్సిపాల్ గాడ్ విన్, ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా కో కన్వీనర్ జన్ను మధుకర్ ఎంఎస్పి వరంగల్ మండల కన్వీనర్ గంగారపు మల్లన్న నాయకులు రహీం, బొ ట్ల శ్రీకాంత్, జూపాక బిట్టు, బొట్ల నితిన్, ప్రేమ్, లడ్డు, తదితరులు పాల్గొన్నారు.