Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండలో రోడ్డుకు ఇరువైపులా చలికి వణుకుతూ పడుకున్న అభాగ్యు లకు బ్లాంకెట్, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పిండి వంటలు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ పలు కార్యక్రమాలు ముగించు కొని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలో రోడ్డుకు ఇరువైపులా చలికి వ ణుకుతూ పడుకున్న వారినిచూసి చలించిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తాత్కాలిక పరిష్కారానికి తక్షణమే స్వంత ఖర్చులతో ట్రైసీటీ వ్యాప్తంగా రోడ్డుకు ఇరువైపులా పడుకుంటున్న వారి కోసం బ్లాంకెట్, సంక్రాంతి పర్వదినా న్ని పురస్కరించుకుని వారికి పిండి వంటలు అందించి శాశ్వత పరి ష్కారం కోసం నగరంలో పునరావాస కేంద్రం ఏర్పాటుకై సీఎం కేసీఆ ర్, మంత్రి కేటీఆర్‌తో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపి స్తామని తెలిపారు. ఎముకలు కొరికే చలిలో చాలా మంది కుటుంబ సమస్యలు, ఇండ్లలో గోడవలతో మరి కొందరు మతిస్థిమితం లేకుం డా ఇబ్బంది పడుతున్నారని కొంతమందిని ఆరాదీస్తే వారి దయనీయ మైన స్థితి కలచివేసిందని ఆయన అన్నారు. మతి స్థిమితం లేకుండా రోడ్లపై ఉంటున్న వారి సామాజిక బాధ్యతనుసమాజంలోని వారు మా నవతాదృక్పథంతో తీసుకోవాలని కోరారు. ఇట్టి విషయాన్ని రాష్ట్ర ప్ర భుత్వం దష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేసేలా కషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, క ల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ ఎండి.షఫీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా బొల్లికొండ వీరేందర్, సామాజిక వేత్త బిఆర్ఎస్ నాయకులు దోమకుంట్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.