Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
అడ్డాలమీద ఆటో కార్మికులు ప్యాసింజర్లతో మ ర్యాదగా నడుచుకుంటూ వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని సీఐటీయూవరంగల్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు మాలోత్ సాగర్, ముక్కెర రామస్వా మి ఆటో కార్మికులకు సూచించారు. తెలంగాణ ఆటో అండ్ట్రాలీ వర్కర్స్ యూనియన్ పక్షాన మండి బజా ర్, చార్బౌలిలో ఆటోఅడ్డాలను సీఐటీయూ ఆధ్వర్యం లో సోమవారం ఏర్పాటు చేశారు. అడ్డాల మీద ఉండే ఆటోకార్మికులు క్రమశిక్షణతో నడుచుకుంటూ ప్రయా ణికుల పట్ల స్నేహభావంతో మెదలాలన్నారు. వేలాది మంది ఆటో కార్మికులు పెద్ద పెద్ద చదువులు చదువు కొని ఉద్యోగాలు దొరకక పొట్టకూటికోసం ఆటో నడు పుకుంటున్నారన్నారు. అధికారులు, ప్రభుత్వాలు, అ డ్డాలవద్ద రక్షణచర్యలు చేపట్టాలేకపోతున్నరని అన్నా రు. కార్మికులకు సంక్షేమ బోర్డు లేకపోవడం తో ప్ర మాదంలో జరిగినప్పుడు గాయపడిన, అనారోగ్య పా లైన ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయం అంద డం లేక వైద్యానికి అప్పులు చేస్తున్నారని, ప్రైవేటు అ ప్పులు ఫైనాన్స్ కట్టలేక కుటుంబాలు పోషించు కో లేక అప్పులు తీర్చలేక ఇ బ్బందులు పడుతున్న టు వంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒకప్రక్కన పె ట్రోల్ డీజిల్ ధరలు పెరగ డంతో పాటు నిత్యావసర సరుకులు పెరగడం మూ లంగా ప్యాసింజర్ ఎక్కక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు ఛలాన్ల పేరుతో, లైసెన్సులు రెన్యువల్ లేదని సాకుతో అధికారులు ఇబ్బంది పెడుతున్న పరి స్థితి ఉందన్నారు.
తక్షణమే ప్రభుత్వాలు, అధికారులు ఆటో కార్మి కులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇల్లు లేని నిరు పేదలకు ఇండ్లస్థలాలు ఇప్పించి ఇల్లునిర్మించి ఆదు కోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కా ర్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆటో, ట్రాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిబుబ్పాషా,అడ్డకమిటీ నాయకులు యాకుపా షా, అమీర్పాషా, అన్వర్పాషా, అబద్ధుల్ పాషా, అశే ఫ్, ఇఫ్రాన్, అమీర్పాషా, ఖలీల్, చిరంజీవి, సాబీర్ పాషా, అజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.