Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8,500 ఎకరాలకు రైతువేదిక కేంద్రాలుగా పంపిణీ
- నియోజవర్గంలో ప్రతి తండాకు..శివారు గ్రామానికి బీటీ రోడ్డు..
- రూ.63కోట్ల నిధులు మంజూరు..నాలుగు నెలల్లో పూర్తి
నవతెలంగాణ-నర్సంపేట
కిందటేడాది జనవరిలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలపై నష్టపరిహారంగా ఇన్ఫుడ్ సబ్సిడీ అందజేసి రైతు లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా నిలుస్తుందని ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల య కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా కిం దటేడాది అకాల వర్షాలు కురిసి రైతులు అపారంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం నాడు పంటలను సందర్శించి రైతులకు నష్టపరి హారం అందించి ఆదుకుంటామని భరో సానిచ్చిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు పంట నష్టం, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిపై నివేదించామన్నారు. సానుకూలం గా స్పందించి ప్రకృతి వైఫరీత్యాల చట్టం ప్రకారం ఇన్ఫుడ్ సబ్సిడీకింద హెక్టార్‌కు రూ.13,500ల నష్టపరిహారం ప్రభు త్వం విడుదల చేసిందన్నారు. నియోజకవర్గంలో 18,500ల ఎకరాల మిర్చి, మొక్కజొన్న ఇతర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ మేరకు త్వరలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు రైతువేదికలు కేంద్రంగా నష్టపరిహారం చె క్కులను అందజేస్తారన్నారు. పంట నష్టపోయిన రైతులకు మొదటి ప్రాధాన్యతగా పీవీసీ పైపులు యూనిట్‌కు రూ.30 వేలచొప్పున 50శాతం సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపా రు. 2600 యూనిట్ల సబ్సిడీ పంప్ సెట్లను అందజేస్తా మని, రైతులు ఆన్లైన్లోలేదా నేరుగా ఉద్యానవన శాఖ అధి కారులకు ధరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోకవర్గంలోని ప్రతితండాకు, శివారు గ్రా మానికి బీటీ రోడ్డు నిర్మాణం చేయడానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుచే ప్రభుత్వానికి ని వేదించామని తెలిపారు. ఇటీవల జివో 35 ద్వారా రూ.63. 88 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. 74 రోడ్లను గుర్తించగా రూ.36కోట్లు బీటీ, రూ.27.50 కోట్లు సీసీ రోడ్ల కు కేటాయించామని చెప్పారు. ప్రజల మౌళిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ఇటి నిధులను మం జూరు చేశారన్నారు. రైతులకు భాసటగా నిలిచినందుకు సీ ఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎమ్మెల్యే పెద్ది కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వ హించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీరం సంజీవరెడ్డి, బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్ రెడ్డి, నల్లామనోహరెడ్డి, నాగెల్లి వెంకటరారాయణ గౌడ్, గుం టి కిషన్, ఖానాపురం ఎంపీపీ వేములపెల్లి ప్రకాశ్‌రావు, నల్ల బెల్లి జెడ్పీటీసీ పెద్ది స్వప్న, చెన్నారావుపేట జెడ్పీటీసీ పత్రి నా యక్, దార్లరమాదేవి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సుకునే రాజేశ్వ రావు, మోతె పద్మనాభరెడ్డి, కోమండ్ల జైపాల్ రెడ్డి, బుర్రి తిరు పతి, మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.