Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి
నవతెలంగాణ-వరంగల్
ఇల్లులేని నిరుపేదల కోసం పట్టాలు పక్కా ఇం డ్లు వచ్చే వరకు భూ పోరాటాలు చేస్తున్నామని సిపి ఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. సోమవారం గొర్రెకుంట శివారు సర్వే నంబర్ 573, 582లో గల ప్రభుత్వ భూమిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేసిన గుడిసెలను సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి సంద ర్శించారు. అనంతరం వరంగల్ మండల కార్యదర్శి బుస్స రవీందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి దళితులకు 3 ఎక రాల భూమి, పేద కుటుం బాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తానని చెప్పిన ఇప్పటివరకు ఏఒక్కరికీ న్యాయం చేయకుండా విఫ లమయ్యాడన్నారు.రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, రియల్ ఎస్టేట్ దారుల చేతుల్లో ప్రభుత్వ భూమి కబ్జా కు గురైందని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో గు డిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూ పోరాటాలు నిర్వహిస్తున్న నాయకులపై అ క్రమ కేసులు పెట్టి భూ పోరాటాలు ఆపలేరని ప్రభు త్వాన్ని హెచ్చరించారు.వరంగల్ జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి భూములు ఉన్నా యని ఎ లాగైతే తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడి కే భూమి అని పోరాడామో అలాగే నేడు పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు సాదించేవరకు భూపోరా టాలు చేస్తామన్నారు.
ఎన్ని కేసులు పెట్టినా ఈ భూ పోరాటం ఆగదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి పేదవర్గాలకు పంచాలని లేకుంటే ఈ భూ మిని సిపిఐ పార్టీ పేద వర్గాలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాషుమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు దండు లక్ష్మణ్, గన్నారపు రమేష్ , గుండె బద్రి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ల్యాదల్ల శరత్, బుజుగండ్ల రమేష్, యాకుబ్, మండల నాయకులు మేడది అశోక్, దేవరాజు,అంజద్ తదితర పార్టీ నా యకులు, కార్యకరతలు పాల్గొన్నారు.