Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసీలో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
నవతెలంగాణ-సుబేదారి
కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి,రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, డీజిపి అం జనీకుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేత లు, హై దరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకో వాల్సిన చర్యలపై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమం, దీని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు క్యాం పుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి కోరారు.
జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛ నంగా ప్రారంభిస్తారని, జిల్లాలలో జనవరి 19 ఉదయం 9 గంటలకు మంత్రులు ఎమ్మెల్యేలు శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి ఎంపిటిసి సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి ఆదేశించా రు. జిల్లాలో కలెక్టర్, డిఎంహెచ్‌ఒ వాట్సాప్ ద్వారా ప్రతి బందం సకాలంలో క్యాం పులు ప్రారంభించేలా పర్యవేక్షణ చేయాలని జిల్లాలో ఉన్న వైద్య బందాలు సమీప పట్టణాలు, మండల హెడ్‌క్వార్టర్‌లో నైట్‌హాల్ట్ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకో వాలని, ఉదయం 8.45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శుల, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పిలు, వీఓఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు స మాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని, ప్రజ లు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు.జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుంచి జిల్లాకలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యరాణి జిల్లా ఉన్నత అధికారులు డీఆర్వో వా సుచంద్ర, డీఆర్డీఏ పీడీ ఆకవరం శ్రీనివాస్‌కుమార్, డీపీవో జగదీశ్వర్, కంటి వె లుగు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.