Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో1200 మంది
నవతెలంగాణ-గూడూరు
ఎవరు కనీవిని ఎరగని రీతిలో ఘనంగా అరబిందో హైస్కూల్ సిల్వర్ జూబ్లీ మహా ఉత్సవం కనుల పండుగగా సంక్రాంతి పండుగ రోజున అరబిందో హై స్కూల్ ప్రాంగణంలో సుమారు 1200మంది విద్యార్థులు కలయిక ఘనంగా పాఠ శాల యజమాన్యం నిర్వహించింది. ఆదివారం రోజున సంక్రాంతి పండుగ పుర స్కరించుకొని 1997-22వరకు అరవిందో హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేసు కున్న నాటి విద్యార్థులు నేడు బావి భారత పౌరులుగా ఎన్నో రంగాలలో ఉన్నప్ప టికీ ఒకే వేదిక పైకి వచ్చి కలుసుకున్న అపురూప ఘట్టం మహా ఉత్సవం కనుల పండుగగా గూడూరులో జరిగింది.అరబిందో పాఠశాల యజమాన్యం సిల్వర్ జూబ్లీ మహౌత్సవం చేయాలని ధృఢ నిశ్చయంతో గత మూడు నెలలుగా నాటి విద్యార్థుల డాటా సేకరించి అందరికీ సమాచారం ఇచ్చి సంక్రాంతి పర్వదినం పుర స్కరించుకొని పండుగను నాటు విద్యాభ్యాసం చేసిన పాఠశాల ఆవరణంలో కను ల పండుగ జరుపుకున్నారు. చిన్ననాటి గుర్తులను ఎవరు వేస్తూ వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఉదయం నుండి సంక్రాంతి ఉత్సవాల అనంతరం ఏర్పాటు ఏర్పా టుచేసిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం సభలో 25 సంవత్సరాల బ్యాచ్ చేయాల నుండి ఒక్కొక్కరిని వారి గుర్తులను వారు పాఠశాలలో చదువుకున్న అను భవాలను వారు నేర్చుకున్న సిద్ధాంతాల పద్ధతులతో ఏ స్థాయిలో ఉన్నారో కొంద రు నాటి విద్యార్థులు ప్రసంగంలో పంచుకున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్‌తో సమ్మేళ నం కొనసాగింది. 25 సంవత్సరాలలో పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసిన ఉపా ధ్యాయులను ఒకే వేదికపై ఒక పాఠశాల యజమాన్యం ఇటు విద్యార్థులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సామాజిక సమర సప్త వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జి మాట్లాడుతూ విద్యావస్థలు విద్యాదశలో నేర్చుకున్న బోధనే నేడు భవిష్యత్తుకు మార్గమని విద్యా ర్థులు చదువుతున్న రోజుల్లో విద్యాబోధనల ద్వారా వచ్చే మార్గదర్శకాలు నేటికీ ఆదర్శమని అరవిందో పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అరవిందో పాఠశాల యజమాన్యం నాటి విద్యార్థులను ఒకే వేదికపై తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అర విందో హై స్కూల్ ప్రతిష్ట మరింత పెంచాలని సూచించారు. తదుపరి అరబిందో హై స్కూల్ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. వెబ్ సైట్ వల్ల ప్రయోజనాలు పూర్వ విద్యార్థులు దేశానికి చేయగల సేవలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ కార్యక్ర మంలో అరబిందో హైస్కూల్ కరస్పాండెంట్ పింగిలి శ్రీనివాస్, చైర్మన్ పింగిలి సంజీవరెడ్డి, డైరెక్టర్లు కాలసాని శ్రీనివాస్ రెడ్డి, నల్ల మాస వెంకన్న పాల్గొన్నారు.