Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమిష్టిగా పని చేస్తాం... పార్టీని గెలిపిద్దాం - జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మసంపెల్లి లింగజీ
నవతెలంగాణ-రఘునాథపల్లి
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అంద రూ సమిష్టిగా పనిచేయాలని జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కడారి నాగే శ్వర్, కాంగ్రెస్ పార్టీ జన1 గామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపెల్లి లింగాజీ, పిసిసి సభ్యులు చేపూరి వినోద్ కుమార్, బొనాసి క్రాంతి కుమార్, గంగిడి నర సింహారెడ్డి, రాపోలు రామ్మూర్తి పిలుపునిచ్చారు. సోమవారం రఘునాథపల్లి మం డల కేంద్రంలో ఆర్యవైశ్య భవనంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు. జోడో అభియాన్ కార్యక్రమం విజయవంతం కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని గడప గడ పకు గతంలో కాంగ్రెస్పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పిలుపు నిచ్చారు. ఈనెల 26వ తేదీ నుండి వంద రోజులపాటు జోడో పాదయాత్ర కార్యక్ర మాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని వారు కోరారు. విభేదాలు పక్కన పెట్టి ఐక్యమత్యంతో పని చేద్దామని కార్యకర్తలు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా నాయకులు గాదె మహేందర్ రెడ్డి, లింగాల జోగరెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇబ్రహీం బాషా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు బి.క్రాంతి కుమార్, కడారి చిన్న నాగేష్, అశోక్, నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడంట్ నీలం యువరాజ్,ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.