Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు నాయిని
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భూకబ్జాదారుల ఆగడాలను నియంత్రించడానికి ఎసిపి స్థాయి ప్రత్యేక అధికారిని నియమించాలని హన్మకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ వరంగల్ పోలీసు కమిషనర్ ఎవి. రంగనాథ్‌ను కోరారు. గురు వారం ఈ మేరకు వారిద్దరూ పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలీసు కమిషన రేట్ పరిధిలో అధికార పార్టీ నాయకులు తమ అంగ బలంతో, అర్ధబలంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భూకబ్జాలు చేస్తున్నారన్నారు.
తాజాగా ఎమ్మెల్యే వినరుభాస్కర్ అనుచరుడు కార్పొరేటర్ వేముల శ్రీని వాస్ భూకబ్జా విషయం పత్రికల్లో చూశామని, ఇప్ప టికీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ భూకబ్జా దందా సాగుతుందని, రెవెన్యూ, పోలీసు అధికారులను అ డ్డం పెట్టుకొని తమను అ డిగే వారేలేరంటూ కార్పొ రేటర్ల ద్వారా భూదందాలు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ భూకబ్జాదారు ల నుండి బాధితులను ర క్షించి వారికి న్యాయం చేయడానికి ఏసీపీ స్థాయి ప్రత్యేక అధికారిని ని ంచాలని కోరారు. ఈనెల 26వ తేదీ నుండి హన్మకొండ జిల్లాలో జరిగే హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు అనుమతినివ్వాలని రాజేందర్‌రెడ్డి కోరారు.
రాహుల్‌గాంధీ పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా దానికి కొనసాగింపుగా ఏఐసిసి హాత్ సే హాత్ జోడో యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించినట్లు ఇందులో భాగంగానే హన్మకొండ జిల్లాలో ఈనెల 26వ తేదీ నుండి డివిజన్లలో, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి, పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రకు అనుమతినివ్వాలని పోలీసు కమిషనర్‌ను కోరారు.