Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
యువకులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, క్రీ డలతోనే మానసిక ఉల్లాసం క లు గుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని నింపుకోవాలని అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్, సీనియర్ జర్నలిస్ట్ అంకేశ్వరపు ఐలయ్య, బి ఎస్ఎస్ జిల్లాకార్యదర్శి మగ్గంసుమన్ అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామం లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటీవల నిర్వహించిన అంబేద్కర్ ప్రీ మియర్ లీగ్క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. గురువారం క్రీడా పోటీ ల ముగింపు శిబిరానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. మొదటి స్థానంలో నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం జట్టు కి రూ.10వేలు, ట్రోఫీ అందజేశారు. రెండవబహుమతి శాయంపేటకు రింకు జట్టు కి రూ.6వేలు నగ దు, ట్రోపీనీ అందజేశారు. ప్లేయర్గా నాగుల కళ్యాణ్ (76 స్కోర్ ), బెస్ట్ బౌలర్ గా అంకెశ్వరపు భాను నాస్తిక్ (7 వికెట్స్ ), బెస్ట్ అల్ రౌండర్ గా గాజుల సాయి కిషిల్డ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్షులు నాలికె ప్రతాప్, సంఘం అధ్యక్షులు బొల్లెపల్లి ప్రసాద్, స్పోర్ట్స్ సెక్రటరీ వినరు, తరుణ్,రాజశేఖర్, నరేష్, స్టాలిన్, వికాస్,సాయి తిలక్, గాంధీ, మనోజ్ కుమార్, పూలే యూత్ అధ్యక్షులు చెల్పూరి శ్రీకాంత్, రజిని పాల్గొన్నారు.