Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలను పెంచు కోవచ్చని, ఈ పెంపుదలకు రెగ్యులరేటరీ కమిషన్ అ నుమతులు అవసరం లేదని తెలుపుతూ డిస్ట్రిబ్యూట రీ కమిటీ(డిస్కంలు)లకు విద్యుత్ నియంత్రణ మం డలి స్వేచ్ఛకల్పించడం పట్ల సీఐటీయూ హనుమ కొండ జిల్లాకమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని జిల్లా కార్యదర్శి రాగులరమేష్ అభ్యంతరం వ్యక్తం చేశా రు. విద్యుత్ వినియోగదారులపై భారాలు మో పే ఈ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ, తక్షణమే ఉప సంహరించు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2018 నుండి 2022 వరకు రెగ్యులేటరీ కమిషన్ టారీఫ్ నిర్ణయించలేదు. డిస్కాంలుఎలాంటి టారీఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదు. ఈ నాలుగేళ్ల బాకీలు రు. 33వేల కోట్ల వసూళ్లకు 2022-23లో టారీఫ్ ప్ర తిపాదనలో ఎలాంటి సూ చనలు లేవు. రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుం డానే డిస్కాంలు గత సంవ త్సరం డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో విద్యుత్ విని యోగదారులపైభారాలు వేసి వేల కోట్ల రూపాయల ను అక్రమంగా వసూలు చేసాయి.
డిస్కంలు అంతర్గత సామర్థ్యం పెంచుకోకుండా వినియోగదారులపై భారాలు వేస్తున్నాయి. నేటికీ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టప్రకారం బొగ్గు, గ్యాస్, నీరు తదితర ముడి సరు కుల ధరలు పెరిగినప్పుడు వాటికి అనుగుణంగా ఛా ర్జీలను పెంచాలని డిస్కాంలు దరఖాస్తులు పెట్టుకుం టే రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణ జరిపి ముడిసరుకుల ధరలకనుగుణంగా ఛార్జీలను నిర్ణ యించాలి. కానీ ముడిసరుకు ధరలు పెరుగుతున్నా యని డిస్కాంలు తప్పుడులెక్కలు చూపించి వినియో గదారుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తు న్నాయి. ఇది సరైందికాదు. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు డిస్కాంలు 'ఫ్యూయల్ సర్ ఛార్జీలు' ఎప్పటిక ప్పుడు వసూలు చేసుకోవాలని గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించడం అత్యంత దుర్మార్గం.2023 ఫిబ్రవ రిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ ఉన్నందున, జనవరి 30లోపు విద్యుత్ ఛార్జీల పెంపు పై డిస్కంల ప్రతిపాదనలపై అభ్యంతరాలను తెలియ జేయాలని రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించింది. అనేకమంది అభ్యంతరాలు కూడా తెలియజేస్తున్నా రు. కాబట్టి ఫిబ్రవరిలో జరిగే బహిరంగ విచారణలో టారిఫ్లు నిర్ణయించే వరకు వినియోగదారుల నుం డి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరా దని, రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అక్రమ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకునివినియోగదారులపై భారాలు పడకుండా చూడాలని సిఐటియు జిల్లా కా ర్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు.